రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ది పనుల పురోగతి విషయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు ద్వారా భూముల పరాయీకరణ (అలీనేషన్) సంబందించి అనుమతులు మంజూరు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల పరాయికరణ భూముల, పి వి జి టి గ్రూప్స్, భూపతిపాలెం , పిఎం జన్మన్ గృహాలు అంశాలపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో సంక్షేమ, ఏపి ట్రాన్సకో, ఎయిర్ పోర్టు, టూరిజం, క్రీడలు , జాతీయ రహదారులు, మార్కెటింగ్, పశు సంవర్థక, విద్య, ఆరోగ్య తదితర శాఖలకు చెందిన 54 భూ సంబంధ అలీనేషన్ ప్రక్రియ పై శాఖాధికారులు దృష్టికి తీసుకుని వెళ్లడం, తగిన అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. ఆయా భూముల పరాయీకరణ కి చెంది ఆర్డీవోలు మూ జారీ చెయ్యాల్సిన అనుమతులు మార్గదర్శకాలను అనుసరించి మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలో ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలు (pvgt) చెందిన 99 కుటుంబాల కు చెందిన 399 మందికి తగిన గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై విచారణ చేపట్టాలని, నివేదికలు ఆధారంగా వారికీ ప్రభుత్వ పరంగా చేయూత నివ్వడం పై దృష్టి పెట్టాలని ఆర్డీఓలు , హౌసింగ్ , రెవిన్యూ, ఐ సి డి ఎస్, డీ ఈ వో , డి ఆర్ డి ఎ, బ్యాంకర్ల లని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో వారికీ అందవలసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అమలు చేయాలని పేర్కొన్నారు. ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు, గృహాలు లేని వారికి ఇళ్లు, స్థలం ఉన్నవారికి ఇళ్ళ నిర్మాణం కోసం గృహ నిర్మాణ మంజూరు, స్వయం జీవనోపాధి కల్పించడం, వారి పిల్లలు విద్యా అభ్యసించెలా ఆయా కుటుంబాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టలని సూచించారు. భూపాలపట్నం భూ సేకరణ ప్రక్రియ పై సమగ్రంగా వివరాలు అందచేయాలని కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, కే ఆర్ సి సి ఎస్దిసీ / ఇన్చార్జి జిల్లా హౌసింగ్ అధికారి డి. భాస్కర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి పాల్గొన్నారు.