ప్రమాదాల నివారణకు పజల భాగస్వామ్యం అవసరం

-రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయండి..
-ఉప రవాణా అధికారి ఎ. మోహన్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, రహదారి భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణాశాఖ అధికారి ఎ. మోహన్‌ తెలిపారు.
జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో పిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణ పై రవాణా శాఖ ఉప రవాణా అధికారి ఎ. మోహన్‌ నగరంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారి భద్రతా పట్ల ప్రజలలో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు మోటర్‌ వాహనాల చట్టాల గురించి వివరించేలా జిల్లాలో నెల రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌, వైద్య ఆరోగ్య, ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కొంత మేరకు ప్రమదాలను నివారించగలుగుతున్నామన్నారు. పూర్తి స్థాయిలో ప్రమాదాలను ఆరికటేందుకు ప్రజలలో అవగాహన కల్పించడం కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సీట్‌ బెల్డ్‌ హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేశామన్నారు. ట్రాఫిక్‌ నిబంధలను పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటున్నామన్నారు, లారీ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించి ట్రాఫిక్‌ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో గత ఏడాది 1343 రోడు ప్రమాదాలు సంభవించగా 431 మంది మరణించడం జరిగిందని 1159 మంది క్షతగాత్రులయారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవింగ్‌ సమయంలో ఫోన్‌ మాట్లాడటం రోడ్డు ప్రమాదాలకు అధిక కారణాలు అయ్యాయన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం ర్యాష్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలు అవగాహన సదస్సులు, వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కళాశాలు. పాఠశాలలో సదస్సులు నిర్వహించడంతో పాటు ప్రమాదాలకు గల కారణాలను తెలియజేస్తూ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్సించి విద్యార్థులను చైతన్య వంతులను చేస్తున్నామన్నారు. వాహన దారులు చేసిన చిన్న చిన్న తపిదాల వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణాంగా వారి జీవితాలతో పాటు కుటుంబ సభ్యులు, ప్రాయాణీకుల జీవితాలు చిన్నాబిన్నమైన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తూ రూపొందించిన లగు చిత్రాలు, చాయ చిత్రాలు ప్రదర్శించడం ద్వారా డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు మాసోత్సవాల ఎంతో దోహదపడుతాయన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో పోలీస్‌, వైద్య ఆరోగ్య , ట్రాన్స్‌ పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ, జాతీయ రహదారులు, మోటర్‌ వాహనాల డీలర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రైవెట్‌ డ్రైవింగ్‌ శిక్షణా కళాశాల యాజమాన్యం భాగస్వామ్యంతో భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నట్లు మోహన్‌ తెలిపారు. అనంతరం రహదారి భద్రతా గుడ్‌ సమరిటన్‌ పై రూపొందించిన పోస్టర్లను రవాణా అధికారులు విడుదల చేశారు.
ప్రాతికేయుల సమావేశంలో రవాణాశాఖ అధికారులు ఆర్‌. ప్రవీణ్‌, కె. వెంకటేశ్వరరావు, కె. శివరాం గౌడ్‌, సత్యన్నారాయణ, అబ్దుల్‌ సత్తార్‌, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం. రాజుబాబు, వీడు స్వచ్చంద సంస్థ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *