తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక జిల్లా రవాణా శాఖాధికారి తిరుపతి కార్యాలయంలో శుక్రవారం హాజరైన లైసెన్స్ దరఖాస్తు దారులందరికీ హెల్మెట్ దారుణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక మోటర్ వాహనాలు తనిఖీ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాడే హెల్మెట్ తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల్ని పాటించేలా ఉండాలని మరియు హెల్మెట్ ధారణ విధివిధానాలని ప్రదర్శించారు. మోటో వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు నిర్దేశించారని హెల్మెట్ ధరించేలా కాకుండా హెల్మెట్ మీ సంక్షేమం అనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. మోటరోహణలో తనిఖీ అధికారి అధికారి శ్రీమతి అతికానాజ్ మాట్లాడుతూ హెల్మెట్ తేనె ప్రయాణం యమలోకానికి సోపానమని హెల్మెట్ ని బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోమని అన్నారు.
ఈ సందర్భంగా స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మోటర్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 129 ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు, అతని వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ను ధరించాలని మరియు మోటార్ వాహన చట్టం రూలు 138(F) ప్రకారం డీలర్ ద్విచక్ర వాహన అమ్మేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ తో పాటు వాహనాన్ని అమ్మ వలెనని ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు.
తదుపరి ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించిన కరపత్రాలు మరియు హెల్మెట్ అవగాహనకు సంబంధించిన కరపత్రాలని వాహనదారులకి పంపిణీ చేయడం జరిగింది.