-రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం, ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు, బందు మిత్రులతో తప్పకుండా రావాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
-ఫ్లెమింగో ఫెస్టివల్ ని జనవరి 18, 19 మరియు 20 తేదీలలో మూడు రోజులు ఘనంగా పండగ వాతావరణంలో విజయవంతం చేద్దాం : ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ
సూళ్ళూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025- ప్రకృతి, సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవాన్ని ఈనెల 18,19 మరియు 20 తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
.
శుక్రవారం సూళ్లూరుపేట పులికాట్ సరస్సు, అటకాని దిబ్బ ఏర్పాట్లు పరిశీలన అనంతరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు ప్రారంబోత్సవం మరియు ముగింపు కార్యక్రమంకు సంబంధించిన వేదిక ఏర్పాట్లను జిల జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ తో కలసి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారుగా 4 సంవత్సరాల తర్వాత మనం ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగా జనవరి 18, 19, 20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని 5 ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దొరవారిసత్రం మండలం నేలపట్టు, సూళ్ళూరుపేటలో అటకానితిప్ప, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు ప్రారంబోత్సవం మరియు ముగింపు కార్యక్రమం ఇక్కడే నిర్వహించబడుతుందని తెలిపారు. అడ్వెంచర్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ సిటీ నుండి, షార్ నుండి స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బి.వి.పాలెం బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీ లో దేశ నలుమూలల నుండి అటవీ సంపదకు సంబంధించి తడినేలల్లో వచ్చే పక్షుల పరిశేలించే ఎన్జిఓ లు, IIT తిరుపతి, IISER, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మరియు పారిశ్రామికవేత్తలను అందరినీ తీసుకొచ్చి ఫ్లెమింగో పక్షుల అభయారణ్యం మరియు పులికాట్ పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ సరస్సు ద్వారా ఎంతో మంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారని, వారి జీవనోపాధిని పెంచాలని అన్నారు. అభయారణ్యంపై ఆధారపడిన, వైజ్ఞానిక సమాజం, స్థానిక సమాజం పట్ల ప్రజలకు ,పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంబోత్సవం కానున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ టూరిజం మంత్రి వర్యులు విచ్చేయనున్నారని, మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రులు రానున్నారన్నారని. తిరుపతి జిల్లా నుండి మరియు సమీపంలోని నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల నుండి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ఈ పండుగకు తమిళనాడుతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని, ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి నెలకొందని, ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని పారిశుధ్యం, ఆహారం మొదలైన అన్ని రకాల ఏర్పాట్లు చేసామన్నారు. పిల్లలు మరియు పెద్దలతో వచ్చి తిరుపతి జిల్లా అతిధ్యాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. పక్షులను వీక్షించడానికి సందర్శకుల కోసం అటవీశాఖ, టూరిజం శాఖ ద్వారా గైడ్లు మరియు పక్షులను వీక్షించడానికి బైనాక్యులర్లను ఏర్పాటు చేసామని తెలిపారు. అన్ని చూసి అవగాహన పెంచుకొని ఈ పక్షులను రక్షించడంలో మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నామన్నారు. ఈ మూడు రోజు పిల్లలు,కుటుంబం తో వచ్చి జిల్లా యంత్రాంగం ఇక్కడ అందించిన సౌకర్యాలను ఆస్వాదించాలన్నారు. CCTV కెమెరాలు, డ్రోన్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారి. నెల పట్టు, పులికాట్ సరస్సు ల పై అవగాహన కలిగిఉండాలని తెలిపారు.
ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈ సంవత్సరం జనవరి 18, 19 మరియు 20 తేదీలలో మూడు రోజులు ఘనంగా పండగ వాతావరణంలో జరుపుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోబోతున్నామన్నారు. . నియోజకవర్గంలో 5 ప్రాంతాలలో ఏర్పాటు చేసామని ప్రజలు అందరు సహకరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అధికారులకు సహకరించి ఫ్లెమింగో ఫెస్టివల్ ను బందు మిత్రులతో కలిసి విజయంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా , ఆర్డిఓ కిరణ్మయి, సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వేదిక ఇన్చార్జి డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.