-చెంగాలమ్మ దేవస్థానం నుండి ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ
-ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
పండగ వాతావరణం లో 18-01-2025 నుండి 20-01-2025 వరకు నిర్వహించునున్న ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 రోజు వారీ కార్యక్రమ వివరాలు.
ప్రారంభ తేదీ 18.01.2025, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూళ్లూరుపేట
మొదటి రోజు: జనవరి 18, 2025 కార్యక్రమ వివరాలు
ఉదయం సూళ్లూరుపేట నందు వెలసి ఉన్న చెంగాలమ్మ దేవస్థానం నుండి ఊరేగింపుతో ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ అనంతరం బెలూన్ విడుదల పూజా కార్యక్రమం, అథ్లెట్ల పరిచయం, ఎగ్జిబిషన్ స్టాల్స్ సందర్శన, ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలన, లోగో ఆవిష్కరణ, నృత్య ప్రదర్శనలు, పక్షి శాస్త్రవేత్తల ద్వారా విద్యా సందేశం, తదుపరి ముఖ్య అతిథి వారి సందేశం,క్రీడా పోటీలు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు,సాయంత్రం 5 నుండి 7 వరకు సాంప్రదాయ సంస్కృతి యొక్క వేడుకలు, రాత్రి 7 గంటల నుండి ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించబడును.
రెండవ రోజు : జనవరి 19, 2025 కార్యక్రమ వివరాలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు క్రీడా పోటీలు
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు, సాయంత్రం 5 నుండి 7 వరకుసాంప్రదాయ సంస్కృతి యొక్క వేడుకలు రాత్రి 7 గంటల నుండి ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించబడును.
3వ రోజు: జనవరి 20, 2025
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాంప్రదాయ వంటల పోటీలు, సా 4 గంటల నుండి 5 గంటల వరకు ముగింపు వేడుక,5 గంటల నుండి 7 గంటల వరకు సాంప్రదాయ సంస్కృతి యొక్క కమ్యూనిటీ వేడుక,7 గంటల నుండి ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు.
జనవరి 18 నుండి 20 వరకు జరుగు అదనపు కార్యకలాపాలు:
* నేలపట్టు మరియు అటకానితిప్ప వద్ద పక్షుల పరిశీలన.
* బి.వి పాలెం వద్ద బోటింగ్ కార్యకలాపాలు
* సూళ్లూరుపేటలో అన్ని వాటాదారులతో కూడిన సాంప్రదాయ వంటల పోటీ
* సూళ్లూరుపేటలో సాహస కార్యక్రమాలు
* నేలపట్టు, అటకానితిప్ప, బి.వి పాలెం మరియు సూళ్లూరుపేట సందర్శనల కోసం ఉచిత బస్సు సేవలు
పైన తెలిపిన రోజువారి కార్యక్రమాల అన్నిటిని వీక్షించేందుకువచ్చు సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాల ద్వారా, డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పోలీసు శాఖ వారిచే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ను చూడటానికి వచ్చు ప్రజలందరికీ అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను తిలకించేందుకు ప్రజలలో అవగాహన కల్పించి వారందరిని వచ్చేటట్లు చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొని ఫ్లెమింగో ఫెస్టివల్ -2025ను పండగ వాతావరణంలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.