-ఘనంగా అన్నపూర్ణ నూతన పట్టు వస్త్రాలంకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చందన దంపతుల కుమార్తె అన్నపూర్ణ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం లబ్బీపేట లోని ఎ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తో కలిసి చిన్నారి అన్నపూర్ణ ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , మాదాల రమేష్ , యలమంచిలి శ్రీధర్, భోగవల్లి శ్రీధర్, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.