స్వ‌యం ఉపాధి రంగంలో మ‌హిళ‌లు,నిరుద్యోగుల‌ను అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని రూరల్, అర్బన్ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వ‌యం ఉపాధి రంగం లోని అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించటంతో పాటు శిక్ష‌ణ అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రోత్స‌హిస్తామ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో జిల్లా మండ‌ల డ్వాక్రా సంఘాల స‌మైక్య‌ల అధ్యక్షుల‌తో ఎంపి కేశినేని శివ‌నాథ్ శుక్ర‌వారం స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు ఆదేశానుసారం ప్ర‌తి ఇంట్లో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం పనిచేస్తుంద‌న్నారు. ఆ దిశ‌గా మ‌హిళ‌లు, నిరుద్యోగుల‌కు జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ (NIRD&PR) సంస్థ‌ ద్వారా స్వ‌యం ఉపాధి రంగంలోని అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి కి రెండో విడ‌త‌గా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాల్లోని డ్వాక్రా సంఘాల సమైక్య అధ్యక్షులను పంపిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనే వారు త‌మ ప్రాంతానికి ఎలాంటి కుటీర ప‌రిశ్ర‌మ ఉప‌యోగ‌క‌రంగా, లాభ‌దాయకంగా వుంటుందో అధ్య‌యనం చేయాల‌న్నారు. ఆ త‌ర్వాత వారు ఎంచుకున్న స్వ‌యం ఉపాది రంగంలో శిక్ష‌ణ ఇప్పించి ప్ర‌తి కుటుంబంలో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ ను త‌యారు చేసేందుకు కృషి చేస్తాన‌న్నారు. అంతే కాదు స్వయం సహాయక సంఘాల మహిళలు, నిరుద్యోగులు స్వ‌యం ఉపాధి రంగం ద్వారా త‌యారు చేసే ప్రొడ‌క్ట్స్ మార్కెటింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్ విష‌యాల్లో కూడా త‌గిన స‌హ‌కారం అందిస్తామ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు కల్పన , ప్రోగ్రాం కోఆర్డినేటర్లు జీవీ నరసింహారావు. సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు, కార్పొరేటర్ చెన్ను పాటి ఉషారాణి,జిల్లాలోని అన్ని మండ‌ల స‌మైక్య అధ్య‌క్షురాలు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *