-ముగ్గురు లబ్ధిదారులకు ఎల్.వో.సి పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ ముగ్గురు లబ్ధిదారులకు అందజేశారు.
తిరువూరు నియోజకవర్గం పుట్రెల గ్రామానికి చెందిన చదలవాడ ఈశ్వరీ రాణి గర్బసంబంధిత శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.4 లక్షల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని ఆమె కుమారుడు చదలవాడ జయనాగేంద్ర సాయికి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.
అలాగే తిరువూరు నియోజకవర్గం విసన్నపేట కి చెందిన తెళ్లూరి ఆనందబాబు వెన్నుముక శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1 లక్ష 26 వేల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని భార్య తెళ్లూరి కాంతమ్మకి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.
విజయవాడ సత్యనారాయణం పురం కి చెందిన అద్దెపల్లి విమాలవతి గుండె శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల 25వేల రూపాయల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని ఆమె కుమారుడు అద్దెపల్లి వెంకట సుబ్బారాజు కి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు. తమకి సీఎంఆర్ఎఫ్ కింద ఎల్.వో.సిలు మంజూరు అయ్యే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి ముగ్గురు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.