సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టండి…

-అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయండి..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృష్టి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.

సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాల సాధనకు చేపట్టిన చర్యలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, డ్వామా, కో`ఆపరేటివ్‌ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు దిశ నిర్థేశం చేయడం జరిగిందన్నారు. సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిపేందుకు అధికారులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి వెన్నెముకైన రైతాంగం అభివృద్ధి చెందితే మిగిలిన రంగాలు మరింత అభివృద్ధి చేందే అవకాశం ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయం పై రైతులలో మరింత అవగాహన కల్పించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబాడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడకం తగ్గించి పచ్చిరెట్ట ఎరువులు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా భూ సారం పెరుగుతుందన్నారు. రైతుల కోసం నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు సిబ్బంది బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయడంలో వ్యవసాయంలో చేపట్టాల్సిన మెలుకువలను వివరించి ఆదాయ మార్గలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 131 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉండగా కేవలం 69 సంఘాలను మాత్రమే ఎరువులు పురుగు మందులను విక్రయిస్తున్నాయని మిగిలిన వాటిలో విక్రయాలు నిర్వహించి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన వరి, మినుము, మొక్కజొన్న వంటి విత్తనాలు సిద్దంగా ఉంచాలన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా వంటి ఫలసాయపు పంటలను చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని, కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పద్దతి అమలు పై అవకాశాలను పరిశీలించాలన్నారు. పశు గనణ కార్యక్రమాన్ని పిబ్రవరి మాసంతరంలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామి పథకం కింద జిల్లాలో 475 మిని గోకులాల షెడ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యాం కాగా 523 నిర్మాణాలను చేపట్టి 335 నిర్మాణాలను పూర్తి చేయడం అభినందనీయమని రైతులు కోరిన చోట షెడ్ల నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. బ్రీడ్‌ ఇంప్రూమెంట్‌ ప్రోగ్రాం ద్వారా ఆడ దూడల సంతతిని పెంచే కార్యక్రమంపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామి పథకం ద్వారా పశుగ్రాసం పెంపకాన్ని చేపట్టి రైతులకు పశుగ్రాసాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాల సాదనలో అధికారుల సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.యం.ఎఫ్‌ విజయకుమారి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్‌, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి దివాకర్‌ బాబు జిల్లా మార్క్‌ ఫెర్డ్‌ అధికారి కె. నాగమల్లిక, జిల్లా మార్కెటింగ్‌ అధికారి మంగమ్మ జిల్లా కో`ఆపరేటివ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, మత్స్య శాఖ అధికారి చక్రాణి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *