అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి వాహనం లో ఆసుపత్రికీ పంపించి తన మానవత్వాన్ని చూపించారు. ఈ రోజు పార్ధసారధి నివాసం నుండి బయలుదేరి మంత్రివర్గ సమావేశానికి వెళ్తుండగా పమిడిముక్కల మండలం కనుమూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.వెంటనే తన కాన్వాయి లోని వాహనాన్ని పంపించి హాస్పటిల్ కు తీసుకొని వెళ్ళి వైద్యం చేయించమని తన సిబ్బందిని ఆదేశించారు. వైద్యులతో మాట్లాడి ప్రమాదానికి గురి అయిన వారిని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Tags amaravathi
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …