నగరంలో అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం బందరురోడ్డులోని బాలోత్సవ భవన్‌లో అమరావతి ఫెస్టివల్‌ సొసైటీ నిర్వహించు అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025 ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌ మరియు ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా గౌరవ అతిధిగా విచ్చేసిన డాక్టర్‌ జి.సురేంద్ర మాట్లాడుతూ…అమరావతి అభివృద్ధిపై ఫొటోగ్రఫీ పోటీలు-2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు నగరంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా వుందన్నారు. నిర్వాహకులు టి.శ్రీనివాసరెడ్డి తన వృత్తిలోనే ఎగ్జిబిషన్‌ నిర్వహించిన అవార్డుల ద్వారా సత్కరించి ఫొటో గ్రాఫర్లకు మనోధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో మరికొంతమంది ఛాయా చిత్రకారులు పాల్గొనాలన్నారు. అమరావతి ప్రజల రాజధాని, దీనిని అందరూ కాపాడుకోవాలన్నారు. కనపడని ప్రతిఫలం మీరు తీసే ఛాయాచిత్రాలు తరాలు మారినా మీరు తీసిన ఛాయా చిత్రాలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.
నిర్వాహకులు టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గడిచిన దశాబ్దకాలంలో అమరావతి అభివృద్ధి కల్చరల్‌ మీద కాంపిటేషన్‌ నిర్వహించామన్నారు. ఇక నుంచి 2025 నుండి జనవరి నుంచి 2026 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 56 మంది ఫొటోగ్రాఫర్లు 112 మంది ఛాయాచిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. వీటిలో 20 ఫొటోలను ఎంపిక చేశామన్నారు.
కామ్రేడ్‌ జిఆర్‌కె-పోలవరపు సాంస్కృతిక సమితి గోళ్ళనారాయణరావు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదిగి దేశంలో గుర్తింపు రావాలని అభిలషించారు. దాని మనవంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని గుళ్ళపల్లి జోత్స్నకి అంకితం చేస్తున్నామన్నారు.
సభాధ్యక్షులు అమరావతి ఫెస్టివల్‌ సొసైటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.పట్టాభిరామయ్య మాట్లాడుతూ ప్రాచీన స్మృతులకు ప్రతీక అయిన అమరావతి గొప్పదనాన్ని ఫొటోగ్రఫీ ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్లకు పేరుపేరున అభినందనలు తెలిపారు. అమరావతి అభివృద్ధిలో కీలకపాత్ర ఫొటోగ్రాఫర్లకు వుందని దీనిని పురాతనాలను ప్రపంచాన్ని తెలియజేయాలంటే ఒక్క ఛాయాచిత్రాల వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ప్రోత్సహించే కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. అనంతరం క్యాటలాగ్‌ను ఆవిష్కరించారు.
న్యాయనిర్ణేతులుగా డాక్టర్‌ సురేంద్ర గుళ్ళపల్లి, డాక్టర్‌ ఎన్‌.వెంకటనారాయణ, గోళ్ళనారాయణరావు, టి.శ్రీనివాసరెడ్డిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఫొటోగ్రాఫర్లు, ఫొటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *