పచ్చదనం పరిశుభ్రతలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం…

-ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ పాటించాలి….
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పచ్చదనం పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం తో పాటు ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసి కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేయాలనీ అధికారులకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం స్టేట్ గెస్ట్ ఆవరణలో గల సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి కలెక్టర్ జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరై పారిశుధ్య పనులు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామం మున్సిపాల్టీలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల మూడోవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని ఆ రోజు పెద్ద ఎత్తున పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య వంతులను చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రతి గృహ యజమానుల్లో పచ్చదనం పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించి తడి పొడి చెత్తలను విడివిడిగా డస్ట్ బినుల్లో వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సేకరించిన వ్యర్ధాల సంపద సృష్టి కేంద్రాలు తరలించి వర్మీ కంపోస్ట్ ను తయారు చేసి అతితక్కువ ధరకే రైతులకు అందజేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలు రోడ్ల వెంట వ్యర్ధ పదార్ధాలను వేసే అలవాట్లు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తన ఇంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. అప్పుడే గ్రామాలు పట్టణాలలో పరిశుభ్రమైన నెలకుంటుందని తద్వారా అంటురోగాలు నివారించి స్వచ్ఛమైన వాతావరణం ప్రజలకు అందుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలో పేరుకుపోయిన చెత్తను వ్యర్ధాలను వారంరోజుల్లో తొలగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. కార్యాలయపు అధికారులు సిబ్బందిని భాగస్వాములను చేసి కార్యాలయాల పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేస్తానని కార్యాలయాలు పరిశుభ్రత ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం లోపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు. సురేంద్రనాధ్, ఏవీఎస్. వివి. ప్రసాద్, ఫారెస్ట్ సెట్టిల్మెంట్ అధికారి ఎ. రవీంద్రరావు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ జె. సుమన్, గురుకుల పాఠశాల డీఈవో కె. రాజేశ్వరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, భూ సేకరణ కోర్ట్ రిజిష్టర్ ఎన్. సూర్యనారాయణ, ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *