-సీహెచ్. లావణ్య
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను అనుసరించి ఎక్సైజ్ కార్యాలయం (నార్త్) ఆవరణలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శీహెచ్ లావణ్య తెలియ చేశారు. మనం నివసించే ప్రాంతాలు, కార్యాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. అదే స్ఫూర్తి తో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషను హౌస్ అధికారి ఆర్.త్రినాధ్, సబ్ ఇన్స్పెక్టర్ సి.రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.