రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సుప్రీం కోర్ట్ వారి ఆదేశాల మేరకు మోడల్ ప్రిజన్స్ మాన్యువల్, 2016లోని 29వ అధ్యాయం ప్రకారం జైలు అధికారులకు జారీ చేసిన అన్ని నియమాలు, నిబంధనలు మరియు ఆదేశాలు ప్రకారం కుల, మత మరియు లింగ వివక్షత లేకుండా ఖైదీల ను చూడాటం మరియు వాటి అమలుకు సంబంధించిన పరిశీలన కోసం తూర్పు గోదావరి జిల్లా గౌరవ ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మరియు సెంట్రల్ జైలు పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్, బోర్డు ఒఫ్ విజిటర్స్ తో కలిసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంను సందర్శించారు.
కారాగారంలోని ఖైదీల ను కుల, మత మరియు లింగ వివక్షత లేకుండా చూడాలని మరియు జీవన పరిస్థితులు, సాధారణ పరిశుభ్రత, పారిశుధ్యం, బ్యారక్స్ లోని వాష్ రూమ్లు, బ్యారక్స్లో మురుగు నీటి నిర్వహణ మరియు పారిశుద్యం, బ్యారక్స్ నందు వాటర్ ట్యాంక్ ల అవసరత, ఖైదీలకు సంబంధించిన భద్రత, ఆహార ప్రమాణాలు, వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు.
ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని, ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలన్నారు. వారికి ఎలాంటి న్యాయ సమస్యలున్నా పారా లీగల్ వాలంటీర్ల ద్వారా కానీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా కానీ సంస్థకు తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి, తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్.పి. తూర్పు గోదావరి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, వైద్య ఆరోగ్య శాఖ అధికార్లు తూర్పు గోదావరి జిల్లా పాఠశాల విద్య అధికారి, ఆఫీసర్, తూర్పు గోదావరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ అధికారి తదితరులు పాల్గొన్నారు.