ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ

-ఈ సోమవారం (20-1-2025) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు
-జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల,డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు,డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.టి.ఆర్. జీవితం ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *