Breaking News

వీధి దీపాల కోసం నగరపాలక సంస్థ వారి స్కై లిఫ్ట్ వెహికల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర వీధి దీపాలను అమర్చేందు, మరమ్మతులు చేసేందుకు సులభతరంలో చేసే స్కై లిఫ్ట్ వాహనాన్ని విజయవాడ నగర పాలక సంస్థ వారు 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్నారని ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్కై లిఫ్ట్ వాహనం, హై మాస్ట్ లైట్స్, ప్రధాన రహదారులు జాతీయ రహదారులలో ఉన్న వీధి దీపాలను అమర్చటం లేదా మరమ్మతులు చేయటం లాంటి వాటికోసం ఆధునిక వాహనం ద్వారా చేపట్టడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలను అందించగలమని అన్నారు. సుమారు ఒక కోటి 17 లక్షల విలువగల రెండు ఆధునిక స్కై లైట్ వాహనాలను 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేశారని, ఆధునిక వాహనాలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు కల్పించడంలో విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి

-రాష్ట్రంలో రక్షణ రంగంలో పెట్టుబడులకు విస్తారంగా అవకాశాలు -ముఖ్యమంత్రికి సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ -ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నరని వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *