-వికసిత్ పంచాయిత్ లో ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ మరియు పంచాయితీరాజ్ ల సహకారంతో వికసిత్ పంచాయిత్ లో భాగంగా గ్రామాభివృద్దితో పాటు ఆర్థికాభివృద్ది సాదించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మండల అధ్యక్షులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ లో ఏర్పాటు చేయటం జరిగిందని ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవగాహన సదస్సు కి హాజరైన సభ్యులు ఎపి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. వికసిత్ పంచాయిత్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గాలైన నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట మండలాలకు చెందిన 16 మండలాల స్వయం సహాయక సంఘాల సమైక్య అధ్యక్షులతో పాటు మొత్తం 30 మంది ఎన్.ఐ.ఆర్.డి లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎన్.ఐ.ఆర్.డి ఖాన్, నేషనల్ రూరల్ లైవ్ హూడ్స్ మిషన్ అసోసియేట్ ప్రోఫెసర్ రాధిక రాణి, ఎన్.ఆర్.ఎల్,ఎమ్. ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ బాబు రావు, మురళీధర్, వికసిత్ పంచాయత్ లక్ష్యంలో భాగంగా గ్రామాలను ఎనర్జీ సఫిషియేంట్ విలేజ్, హెల్తీ విలేజ్, చైల్డ్ వెల్పేర్ విలేజ్, వుమన్ ఎన్ పవర్మెంట్ విలేజ్, వుమెన్ ఫ్రెండ్లీ విలేజ్, పావర్టీ ఫ్రీ విలేజ్(పేదరికం లేని గ్రామం) గా ఏ విధంగా అభివృద్ది చేసుకోవచ్చనే అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే ఈ అవగాహన సదస్సు లో రూరల్ డెవలప్ మెంట్ నిమిత్తం సెంటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, వున్న పథకాలు, గ్రామీణా ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపర్చేందుకు, సిల్క్ డెవలప్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలను వివరించారు.
అలాగే బయో పెస్టిసైడ్స్ అండ్ నీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ , వర్మికంపోస్ట్, ముష్రూమ్ కల్టివేషన్ అండ్ ప్రొసెస్, హనీ మేకింగ్ ప్రొసెపింగ్, సోయా అండ్ మిల్లేట్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్, లీఫ్ ప్లేట్ అండ్ కప్ మేకింగ్, డైయింగ్ అండ్ వీవింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ , హ్యాండ్ మేడ్ పేపర్, ట్రైబుల్,ఫ్యాషన్ అండ్ పేపర్ జ్యూయల్లరి, హోమ్ బేస్ట్ ప్రొడక్ట్స్ తో పాటు దాదాపు 15కి పైగా స్వయం ఉపాధి అవకాశాల పై అవగాహన కల్పించారని ప్రకటించారు. విజయవాడ నుంచి వీరందర్నీ ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బస్సులో బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కందుల కల్పన, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్, తిరువూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు గణేష్ గౌడ్, జగ్గయ్యపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు జామా ఆనందరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News