Breaking News

జాతీయస్థాయి వ్యాసరచన విజేత సిద్ధార్థ విద్యార్థిని

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం, గురజాడ ఫౌండేషన్ (అమెరికా), ప్రకాశిక అంతర్జాల పత్రిక సంయుక్తంగా మహాకవి గురజాడ అప్పారావు 109వ వర్ధంతి సందర్భంగా డిగ్రీ, పి.జి. విద్యార్థులకు “గురజాడ భావస్ఫూర్తి”అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీల్లో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తృతీయ సంవత్సరం బి.సి.ఎ. విద్యార్థిని బాగ్ దుర్గాభవాని నగదు బహుమతి, ప్రశంసపత్రం గెలుపొందడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల, తెలుగు శాఖాధ్యక్షులు డా.ఎన్.శివకుమార్, సహాయక ఆచార్యులు డా. పి. నీరజ, జి.శేషారత్నం, డాక్టర్ సశ్రీ హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *