Breaking News

పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి ఫిబ్రవరి 27 న జరిగే ఎన్నికలకు సంబంధించి స్థానిక ఏ.సి కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చే గదులు , రిసెప్షన్ సెంటర్లు , డిస్ట్రిబ్యూషన్ సెంటర్ , కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల నుండి ఏ.సి కళాశాలకు వచ్చే వాహనాలు , తిరిగి వెళ్ళే వాహనాలతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. రిసెప్షన్ కౌంటర్ల వద్ద బ్యాలెట్ బాక్సుల స్వీకరణ , వాటిని సంబంధిత గదులకు తరలించే మార్గాల్లో బారీకేటింగ్ ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టాలని , సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని , పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి షేక్. ఖాజావలి , ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , జీయంసీ అదనపు కమిషనర్ ఓబులేశు , గుంటూరు తూర్పు మండల తహశీల్దార్ నగేష్ , రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *