గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ ఎంఎల్ సి ఎన్నికల నిర్వహణపై రూపొందించిన నిబంధనావళి పుస్తకాన్ని క్షుణ్ణంగా ఆకాళింపు చేసుకుని నోడల్ అధికారులు ఎన్నికల విధులు పకడ్బంధీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సూచించారు.
శుక్రవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా లతో కలసి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ ఎం ఎల్ సీ ఎన్నికల నిర్వహణకు గాను ఏర్పాటు చేసిన మ్యాన్ మేనేజ్మెంట్ , ట్రాన్స్ పోర్ట్ మేనేజ్మెంట్ , ట్రైనింగ్ మేనేజ్ మెంట్ , మెటీరియల్ మరియు బ్యాలెట్ బాక్సుల నిర్వహణ , కంప్లయింట్ల పరిష్కారం , లా అండ్ ఆర్డర్ , పోస్టల్ బ్యాలెట్ల ముద్రణా , మీడియా కమ్యూనికేషన్ , స్వీప్ కమ్యూనికేషన్ ప్లాన్ , పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు , ఎలక్టోరల్ రోల్స్ మరియు మార్క్డ్ కాపీల తయారీ , డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు కౌంటింగ్ సెంటర్ల మేనేజ్ మెంట్ల పై ఏర్పాటు చేసిన నోడల్ అధికారులు ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా చదివి , ఆ మేరకు ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తదుపరి సమావేశంలో ప్రతి నోడల్ అధికారితో వారికి కేటాయించిన విధులపై వారికి వున్న అవగాహనను సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు. స్వీప్ యాక్టివిటి ద్వారా ఓటు వేసే విధానంపై విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు.
సమావేశంలో నోడల్ అధికారులు డిఆర్ఓ షేక్.ఖజావలి , సిపిఓ శేషశ్రీ , డీటీసీ కె. సీతారామిరెడ్డి , జెడ్ పీ సిఇఓ జ్యోతిబసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు ఓబులేశు , ఆర్డీవో కె.శ్రీనివాస రావు , బిమల్ కుమార్, పీడీలు హౌసింగ్ , డ్వామా , డీఆర్డీఏ ప్రసాద్, బి.శంకర్, విజయలక్ష్మీ , జిల్లా ఉపాధి అధికారిణి దుర్గాబాయి, డిఎస్ఓ కోమలి పద్మ , డిపిఓ కె. నాగసాయి కుమార్, సమాచార శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ రఫీక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News