-జిల్లా అదనపు వైద్యాధికారి డా . ఎన్ . వసుంధర
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ మండలం లోని రాజవోలు పంచాయతీ మరియు వెంకటనగరం పంచాయతీ క్లెయిమ్స్ ను జిల్లా పరిశీలన బృందం పరిశీలించడం జరిగిందని జిల్లా వైద్యాధికారి డా . కే . వెంకటేశ్వర రావు, జిల్లా అదనపు వైద్యాధికారి డా . ఎన్ . వసుంధర అన్నారు.
మంగళవారం టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్ ప్రోసెస్ ప్రారంభించడం జరిగింది. జిల్లా వైద్యాధికారి డా.కే.వెంకటేశ్వరరావు నేతృత్వంలో జిల్లా అదనపు వైద్యాధికారి డా. ఎన్.వసుంధర, జిల్లా పంచాయతీ అధికారి వి. శాంతి మణి , ప్రభుత్వ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం నుండి డా.సురేంద్ర మరియు ఐఎమ్ఏ నుండి డా.వై.గురుప్రసాద్ సభ్యులు. పరిశీనలకు బృందం వచ్చినప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లోని మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది టీబీ సూపర్ వైజర్, టీబీ ల్యాబ్ సూపర్ వైజర్ పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
2023 వ సంవత్సరానికి గాను తూర్పు గోదావరి జిల్లా నుండి 109 పంచాయతీలు టీబీ ముక్త్ పంచాయతీలకు క్లెయిమ్స్ సమర్పించాయి. అన్నీ క్లెయిమ్స్ పరిశీలించిన తరువాత అన్ని 109 పంచాయతీలు బ్రాంజ్ మెడల్ ను అందుకున్నాయన్నారు.
2024 వ సంవత్సరానికి గాను తూర్పు గోదావరి జిల్లా నుండి 107 పంచాయతీలు టీబీ ముక్త్ పంచాయతీలకు క్లెయిమ్స్ సమర్పించాయి . వీటిలో 77 సిల్వర్ మెడల్ కొరకు మరియు 29 బ్రాంజ్ మెడల్ కొరకు పోటీపడుతున్నాయి . ఈ 107 పంచాయతీల క్లెయిమ్స్ ను జిల్లా బృందం , మరియు 12 ఇతర బృందాలు క్షుణ్ణముగా పరిశీలించి దరఖాస్తులను సెంట్రల్ టీబీ డివిజన్ కు పంపించడం జరుగుతుంది .
ఈ పరిశీలనకు మరియు ఆన్లైన్ లో సబ్మిట్ చేయుటకు ఆఖరి తేదీ మార్చ్ 10 2025.
ఒక గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ పంచాయతీ అవడానికి కావలసిన అర్హతలు :
1. గ్రామ జనాభా అనుగుణంగా ప్రతి వెయ్యి జనాభాకు 30 టీబీ కఫం పరీక్షలు జరిగి ఉండాలి .
2. టీబీ నోటిఫికేషన్ గ్రామ జనాభా అనుగుణంగా ప్రతి వెయ్యి జనాభాకు ఒకటి లేదా అంతకన్నా తక్కువుగా నమోదు కావాలి .
3. UDST- యూనివర్సల్ డ్రగ్ ససెప్టిబిలిటీ టెస్ట్ ఆ గ్రామంలో అందరు పేషెంట్స్ కు జరిగి ఉండాలి .
4. నిక్షయ్ పోషణ యోజన క్రింద కనీసం ఒక విడత అయినా ప్రభుత్వం నుండి రోగి అందుకుని ఉండాలి .
5. పోషకాహార బుట్ట గ్రామంలో ప్రతి టీబీ రోగి అందుకుని ఉండాలి .
6. టీబీ ట్రీట్మెంట్ ఔట్ కమ్ అనగా క్యూర్డ్ గాని ట్రీట్మెంట్ కంప్లీట్ గాని 85% మించి ఉండాలి .
Prajavartha Online Telugu News