రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ నంధు “గిరిజన హక్కుల పరిరక్షణ మరియు అమలు” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో న్యాయమూర్తి ఎన్. శ్రీ లక్ష్మి మాట్లాడుతూ గిరిజనులకు భారత రాజ్యాంగం ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి మరియు నల్సా వారి (“గిరిజన హక్కుల రక్షణ మరియు అమలు)పధకం, 2015 గురించి వివరించారు. వారు హక్కులను వినియోగించుకుని అభివృద్ధి సాధించాలన్నారు. వారికి అందుబాటులో ఉన్న పధకలు గురించి వివరించారు. ఈ విషయంలో వారికి ఎలాంటి సహకారం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ కె.ఎన్. జ్యోతి , ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది, న్యాయవాది డీ. వేంకటేశ్వర రావు , పార లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని, కె.వి.స్టేట్ హోం మరియు బాల సదనమ్ ను సందర్శించి వసతులను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచితంగా న్యాయవాదిని పొందడం వారి హక్కు అని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అందిస్తున్న సేవల గురించి వివరించారు. వసతి గృహములో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు.
Prajavartha Online Telugu News