-రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణ లో..
-హాజరు కానున్న ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ) ఎస్.శాంతిప్రియ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి అకౌంటెంట్ జనరల్ ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ)ఎస్. శాంతిప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10గంటలకు తూర్పు గోదావరి జిల్లా పరిధి లోని పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులు, డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి కార్యాలయాల్లో, శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ కేసులు, పెన్షన్ అనుబంధ సమస్యల వివరాలతో హాజరుకావాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్స్ మరియు జిపిఎఫ్ కేసులను సమీక్షించి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ) కార్యాలయం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏ.పి.సెక్రటేరియట్ వెలగపూడి, ఏ.పి.డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళగిరిలోను పెన్షన్ మరియు జిపిఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు శాంతిప్రియ తెలిపారు. తూర్పుగోదావరి రాజమండ్రిలో ఈ నెల 19 న ఆర్ట్స్ కళాశాల లో నిర్వహిస్తున్నామన్నారు.
పెన్షన్ జిపిఎఫ్ అదాలత్ కార్యక్రమంలో అకౌంటెంట్ జనరల్ (ఏ&ఇ) కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్)పి. కిషోర్ రెడ్డి పోలు, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అర్హతలు) వి. లలిత్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్,/పెన్షన్స్, జి.సునీత, టి. విజయ్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్/జిపిఎఫ్. డి చంద్ర శేఖర్ హాజరవుతున్నట్లు తెలిపారు.
కావున తూర్పుగోదావరి జిల్లాలోని పెన్షనర్లు , .జిల్లా అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ కోరారు.
Prajavartha Online Telugu News