Breaking News

జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు అడుగులు వేయాలి…

-ఆరోగ్యకరమైన పంటలు కొరకు ప్రకృతి వ్యవసాయం సాగును ప్రోత్సహిద్దాం.
-జిల్లా కలెక్టర్, పి.ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్య వసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాలలోని పంటలను పండించడం అభినందనీయమన్నారు. వీరు పొలంలో చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ మొదలగు రకాల పంటలు వెయ్యడం జరిగిందన్నారు. వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచి కారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. జిల్లాలో 42 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. 12 డ్రోన్ల టెక్నాలజీ తో 3800 మంది రైతులు 4200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగుల మందులు వాడకం తగ్గించడం శుభ పరిణామం తెలిపారు. 7300 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా రని తెలిపారు. రైతులు అందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి, ఖర్చు తగ్గించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పంటలను సందర్శన చాలా సంతృప్తికరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ఎస్.మాధవరావు, కొవ్వూరు ఆర్టీవో రాణి సుస్మిత, కొవ్వూరు ఏపిసిఎన్ ఎఫ్,డీపీఏం, బి.తాతారావు,అదనపు డిపిఎం మహబూబ్ వలి, వ్యవసాయ శాఖ ఏడి, పి చంద్రశేఖర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *