Breaking News

ప్రశాంతంగా ఈడిఎం పోస్టు రాత పరీక్ష

-హాజరైన 93 మంది అభ్యర్థులు
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కి చెందిన ఈ-గవర్నెన్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఈ డి ఎం ) కాంట్రాక్టు పోస్ట్ భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలియ చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ డి ఎం రాత పరీక్ష ను పరిపాలన అధికారి ఎండీ ఆలీ, సెక్షన్ సూపరింటెండెంట్ మహేశ్వరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, పొరుగుసేవల కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ డి ఎం పోస్టు కోసం 115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 93 మంది (81 శాతం) హాజరు కాగా, 22 మంది అభ్యర్థులు హాజరుకాలేదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *