Breaking News

రీ సర్వే పై ఇచ్చిన ఉత్తర్వుల, ప్రత్యుత్తరాలకి సంబంధించి రీ ఓపెన్ అయిన అర్జీలను పరిశీలన

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే పై ఇచ్చిన ఉత్తర్వుల, ప్రత్యుత్తరాలకి సంబంధించి రీ ఓపెన్ అయిన అర్జీలను పరిశీలించి అర్హమైన అర్జీలను పరిష్కారం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పెండింగ్ ఫైల్స్, రీ ఓపెన్ అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు ఆధ్వర్యంలో కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ , భూ అనుబంధ సంబంధ అర్జీల పరిష్కారం విషయంలో తప్పనిసరిగా జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలో రీ ఓపెన్ అయిన పీ జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారం, రీ సర్వే అభ్యంతరాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సంబంధించిన సర్వే వివరాలను హేతుబద్ధత కలిగి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అర్జీలను పరిష్కారం చేసే ప్రక్రియ లో నిజ నిర్ధారణ, ప్రామాణిక పత్రాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యుటేషన్, కోరిలేషన్, రీ సర్వే తదితర అంశాలకు సంబంధించి 60 కేసులను పరిష్కరించి ధ్రువపత్రాలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేయాడం జరిగింది.

రాజానగరం మండలం, తూర్పు గోనగూడెం గ్రామ కాపురస్తులు నల్లజాన పశువులయ్య (భర్త) వీరన్నఅనువారు తూర్పు గోనగూడెంగ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెం68/2 లో ఏ. 2.00 సెంట్లు భూమి సర్వే నెం, 68/2, 69/2, 69/3 & 70/6 తప్పుగా నమోదు చేశారని, సదరు LPM కు పాత సర్వే నెంబర్ కొరిలేషన్ సరిచేయవలసినదిగా కోరియున్నారు. ఆమేరకు రికార్డులు పరిశీలించి హక్కు పత్రాలను జారీ చేయడం జరిగింది.

రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామ కాపురస్తులు తలశిల కుటుంబ రాజ్యలక్ష్మి (భర్త) జనార్ధనరావు అనువారు నరేంద్రపురం గ్రామ LPM No 1755 లో ఎ. 1.002 సెంట్లు భూమి రీసర్వేలో వచ్చిన వెబ్ అడంగల్ లో తప్పుగా నమోదైన కొరిలేషన్ సర్వే నెంబర్లు సరివేయుటకు ఆర్జీ దాఖలు చేసియుండగా, సదరు ఆర్జీ పై తహసిల్దార్, రాజానగరం వారు విచారణ చేసి వివరాలు నిర్ధారణ చేసిన అనంతరం ధ్రువ పత్రం అందచెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, డిప్యూటీ సర్వేయర్ వై. మోహన్ రావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *