-ఇంటర్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15 వరకు
-జిల్లాలో 50 కేంద్రాల్లో హాజరు కానున్న 7306 మంది విద్యా ర్ధులు
-ఎక్కడా కాపీయింగ్ జరగ కుండా చర్యలు తీసుకోవాలి
-పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం
-డి. ఆర్. ఓ, టి. సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి 31 లేదా ఏప్రిల్ 1 వ తేదీ వరకు, ఇంటర్మీడియట్ పరీక్ష లు నిర్వహిస్తున్నామని డి.ఆర్. ఓ, టి. సీతారామ మూర్తి అన్నారు. మంగళవారం డిఆర్వో కార్యాలయంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో 50 కేంద్రాల్లో 7306 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్మీడి యట్ పరీక్షలకు 21 కేంద్రాల్లో 4802 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని అన్నారు. పదో తరగతి పరీక్షలకు 29 కేంద్రాల్లో 2504 మంది విద్యార్థు లు హాజరవుతున్నారని తెలిపారు. మార్చి 17 నుండి మార్చి 31 లేదా ఏప్రియల్ 1 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు కట్టుదిట్టంగా, ఎక్కడా కాపీ జరగకుండా నిర్వహించాలని తెలిపారు. 5 ఫ్లయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయ డం జరుగుతుందని తెలిపారు
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికా రులను ఆదేశించారు. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని ఆర్.టి.సి అధికా రులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను నిర్వహించి అత్యవసర మందులను సిద్ధంగా ఉంచా లని వైద్యాధికారులను సూచించారు. ప్రశాంత వాతావరణం లో పరీక్షలు జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పని చేయాలని ఆదే శించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఎన్.బి ఎం.మురళీ కృష్ణ, జిల్లా పాఠశాల విద్యా అధికారి కే. వాసుదేవ రావు, ఎం. వి. ఐ, జి. రామనా రాయణ్, వైద్యాధికారి పి జా న్సన్ రాజు, తదితరులు పాల్గొ న్నారు.
Prajavartha Online Telugu News