Breaking News

స్వ‌యం ఉపాధి రంగంలో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేయూత‌

-బ‌లుసుపాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం

జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌హిళ‌లు ఆర్థికాభివృద్ధి సాధిస్తే ఆ క‌టుంబంతో పాటు ఆ గ్రామం కూడా అభివృద్ది సాధిస్తుంది. స‌మ‌గ్ర గ్రామాభివృద్దితో పాటు మహిళులు, నిరుద్యోగ యువ‌త ఆర్థికాభివృద్ది సాధించేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేస్తున్న కృషి పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ వివ‌రించారు. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం బ‌లుసుపాడు గ్రామంలో గురువారం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ డ్వాక్రా మ‌హిళ‌ల‌తో, గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశంలో మండల సమైక్య అధ్యక్షులు గద్దె రాజ్యలక్ష్మి, వెలుగు ఏపీఎం వెంకటేశ్వరరావు, ఏజీఎం మునిర‌త్నం మాట్లాడుతూ స‌మగ్ర గ్రామాభివృద్ది కోసం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అన్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌న సొంత నిధుల‌తో కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ) సంస్థలో గ్రామీణాభివృద్దితో పాటు ప్ర‌జ‌ల‌ను స్వ‌యం ఉపాధి రంగాల్లో ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ది చేయాల‌నే అంశాల పై పంచాయతీ ఛాంపియన్స్ కి శిక్ష‌ణ ఇప్పించార‌ని తెలిపారు.

స్వ‌యం ఉపాది రంగాల్లో ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు వున్న‌ఆర్థిక అవకాశాలు గురించి వివ‌రించారు. స్వ‌యం ఉపాధి రంగంలో త్వ‌ర‌గా అభివృద్ది చెందాలంటే ఏ యూనిట్స్ పెట్టుకుంటే లాభంగా వుంటుందో తెలియ‌జేశారు. ముఖ్యంగా పచ్చళ్ళు తయారీ, ఆర్గానిక్ పసుపు, కారం, కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి, పుట్టగొడుగుల పెంపకం, జూట్ బ్యాగులు తయారీ, పూసల పరిశ్రమ గురించి వివరించారు. స్వ‌యం ఉపాధి రంగం ద్వారా మ‌హిళ‌లు త‌యారు చేసే వ‌స్తువులకి అవ‌స‌ర‌మైన మార్కెటింగ్ స‌హ‌కారం కూడా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అందించ‌టానికి సిద్దంగా వున్నార‌ని తెలిపారు. అలాగే పి.ఎమ్.జి.పి (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం) ద్వారా అందించే ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాల గురించి వివరించారు. గ్రామాభివృద్ది కోసం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చేస్తున్న కృషి కి ప్ర‌జ‌లంద‌రి త‌రుఫున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ బి.స‌తీష్ నాయ‌క్, షేక్ నాగుల్, కె.క్రాంతి కుమార్, తీగ‌ల రాజేష్‌, కొరివి సైదులు, పిల్లి చిట్టిబాబు, దోరేప‌ల్లి బాల‌గోపి, పేరం ర‌మేష్ లతో పాటు డ్వాక్రా మ‌హిళ‌లు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 18 నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు

-పాత సాంప్రదాయానికి తిరిగి అంకురం చేస్తున్న సీఎం చంద్రబాబు -గత ఐదేళ్ల పాలనలో ఇటువంటి కార్యక్రమాలు జరపలేదు -చీఫ్ విప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *