-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రేమ, నిస్వార్థంతో కూడిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత గొప్ప వ్యక్తుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరేందుకు కృషిచేయాలని సూచించారు. మహనీయుల త్యాగనిరతి, స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.