విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మే నెలలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే! ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుజనాను మందకృష్ణ మాదిగ బుధవారం మర్యాదపూర్వకంగా కలవడంతో ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న మందకృష్ణను సుజనా చౌదరి అభినందించారు. పద్మశ్రీ పురస్కారాన్ని సమాజానికి అంకితం చేసిన ఆయనను కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో కోలుకున్న సుజనా అతిత్వరలో ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని మందకృష్ణ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News