గుడివాడ డివిజన్లో 1,162 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…

– 1.20 శాతానికి తగ్గిన కోవిడ్ -19 పాజిటివిటీ
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ డివిజన్లో మంగళవారం ఒక్కరోజే 1,162 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో 42 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి వైరస్ సోకిందని తెలిపారు. గుడివాడ పట్టణంలో 171 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా వైరస్ సోకిందన్నారు. ముదినేపల్లి మండలంలో 55 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నారు. పామర్రు మండలంలో 248 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురికి వైరస్ సోకిందన్నారు. కైకలూరు మండలంలో 91 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి వైరస్ సోకిందన్నారు. పెదపారుపూడి మండలంలో 310 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి వైరస్ సోకినట్టు చెప్పారు. గుడ్లవల్లేరు మండలంలో 34 మందికి, కలిదిండి మండలంలో 120 మందికి, మండవల్లి మండలంలో 55 మందికి, నందివాడ మండలంలో 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని చెప్పారు. డివిజన్లో కరోనా పాజిటివిటీ రేటు 1.20 శాతానికి తగ్గిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *