Breaking News

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 బిడ్డింగ్ లో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న ఏడు సంస్థ‌లు

-బిడ్స్ ఓపెన్ చేసి, సంస్థ యజమానుల పేర్లు ప్ర‌క‌టించిన ఏపీల్ గవర్నింగ్ కౌన్సిల్

విశాఖ‌పట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 కు సంబంధించి డా. వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన త‌ర్వాత ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీల‌ను సొంతం చేసుకున్న సంస్థ‌ల‌ పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ ఏపీఎల్ -4 లో 1. ఆర్.కె. స్పోర్ట్స్-సౌత్ జోన్, 2. అక్ష‌ర ఎంట‌ర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -సౌత్ జోన్, 3. విజేత సూప‌ర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ -సౌత్ జోన్, 4.అపర్ణా మెరైన్ ఎక్స్‌పోర్ట్స్-సెంట్ర‌ల్ జోన్, 5.మైత్రి మూవీ మేక‌ర్స్-సెంట్ర‌ల్ జోన్, 6.మార్లిన్ గ్లోబల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ – నార్త్ జోన్, 7.స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – నార్త్ జోన్ ఈ సంస్థ‌లు ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఏపీఎల్ -సీజ‌న్ 4 కి సంబందించి బిడ్డింగ్ జూన్ 27 వ తేదీ వేయ‌గా, జూలై 1 వ తేదీ సాయంత్రం 4:30 గంట‌ల పాద‌ర్శ‌కంగా ప‌రిశీలించి సంస్ధ‌ల యాజ‌మానుల పేర్లు ప్ర‌క‌టించ‌టం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అద్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ , ఏసీఏ గౌర‌వ కార్య‌ద‌ర్శి, ఎంపీ సానా స‌తీష్ బాబు స‌హ‌కారంతో నిర్వ‌హించ‌బోయే ఏపీఎల్-4 బిడ్డింగ్ కి అద్భుత స్పందన లభించిందన్నారు. గ‌తంలో 6 జ‌ట్ల‌తో కొన‌సాగిన ఎపీఎల్ …ఇప్పుడు ఏడు జ‌ట్లుగా విస్త‌రించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో వున్న యువ క్రికెట‌ర్ల‌ను ప్రోత్స‌హించాల‌న్న ల‌క్ష్యంతోనే జ‌ట్లు సంఖ్య పెంచిన‌ట్లు పేర్కొన్నారు.

ఏపీఎల్ హెడ్ మిస్టర్ సంకేత్ సోని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించటంతో పాటు రిజిస్ట్రేషన్ నుండి బిడ్స్ విలువ నిర్ధారణ వరకు అన్ని దశలను సమర్థవంతంగా సమన్వయం చేసిన‌ట్లు తెలిపారు. ఏపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ చైర్మ‌న్ రావు వెంక‌ట సుజ‌య్ కృష్ణ రంగారావు పర్యవేక్షణలో పారదర్శకంగా జ‌రిగింద‌న్నారు. . అలాగే ఏసీఏ కోశాధికారిదండ‌మూడి శ్రీనివాస్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఏపీఎల్ సీజ‌న్ -4 లో క్రికెట్ ఆడేందుకు యువ‌తీ యువ‌కులు ఇద్ద‌రికీ అవకాశాలను అందించేందుకు గవర్నింగ్ కౌన్సిల్ పలు ప్రగతిశీల చర్యలు తీసుకుంద‌ని, రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు వేదికగా నిలిచే ఏపీఎల్-2025 విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *