-టిడిపి నాయకుడు నాదెండ్ల రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల్లో వున్న మహిళలకు కుటీర పరిశ్రమలపై అవగాహన కార్యక్రమల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని ఎన్.ఐ.ఆర్.డి. ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, టిడిపి నాయకుడు గద్దెక్రాంతి అన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ దిశా నిర్ధేశం మేరకు తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ తెలుగుదేశం నాయకుడు నాదెండ్ల రాజేష్ రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం కనకమేడ రవీంద్ర కుమార్ కమ్యూనిటీ హాల్ లో 9 స్లం సమాఖ్యల ఫెడరేషన్ (ఎస్.ఎల్.ఎఫ్) లో వున్న డ్వాక్రా సంఘ సభ్యులకు కేశినేని ఫౌండేషన్ ద్వారా కుటీర పరిశ్రమలపై అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది. డ్వాక్రా మహిళలకు ఆసక్తి వున్న కుటీర పరిశ్రమల వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టిడిపి నాయకుడు గద్దెక్రాంతి, ఎన్.ఐ.ఆర్.డి. ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ హాజరైయ్యారు.
ఈ సందర్భంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త తయారు కావాలన్న సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ,పట్టణాల పరిపూర్ణ వికాసం కోసం, తద్వారా ప్రజల ఆర్థిక అభివృద్దికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, కుటీర పరిశ్రమలైన బ్యూటీషియన్స్ కోర్స్, మగ్గం వర్క్స్ , కుట్టు మిషన్, ఇస్తారాకుల తయారీ , కాటన్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, సోలార్ రూప్ టాప్ , సోలార్ డ్రైయర్లు, ప్యాకింగ్ మిషన్ వంటి వాటిల్లో కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపీ కేశినేని శివనాథ్ శిక్షణ ఇప్పిస్తారని తెలియజేశారు.అందరి అనుకూలంగా వుండే ప్రదేశంలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి , ఈ సెంటర్స్ లో మహిళలకు కావాల్సిన స్కిల్ డెవలప్ మెంట్ , కుటీర పరిశ్రమలపై శిక్షణ కార్యక్రమాలు ఇస్తారని తెలిపారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా కేశినేని ఫౌండేషన్ సహాయం అందిస్తుందన్నారు.
టిడిపి యువనాయకుడు గద్దె క్రాంతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు అండగా ఉంటుందన్నారు. ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ కల్పించారని, దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు మహిళలను ఆర్థికంగా చైతన్యవంతం చేసేందుకు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మహిళల అభ్యున్నతికి అధికంగా ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు..
కేశినేని ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారన్నారు. మహిళలకు పచ్చళ్ల తయారీ, జ్యూట్ బ్యాగులు తయారీ, కుట్టు శిక్షణ వంటి పలు నైపుణ్యాలు కేశినేని ఫౌండేషన్ ద్వారా అందించేందుకు ఎంపీ కేశినేని చిన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేశారన్నారు. ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకొవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, డ్వాక్రా సంఘాల జిల్లా అర్బన్ అధ్యక్షురాలు కె.మీనాక్షి, తూర్పు నియోజకవర్గ సి.డి.వో ఉమామహేశ్వరి, సి.వో ప్రసాద్, ఎస్.ఎల్.ఎఫ్. ఓ.బిలతో పాటు డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News