-ఓ అత్యద్భుత వేడుకలో, గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి తమ కృతజ్ఞతలు తెలియజేసేందుకు, భక్తి లో ఓలలాడేందుకు, 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు జతగూడారు.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికా, ఇంకా ఖండాంతరాలలో- తమ జీవితాలలో సంతోషాన్ని, వెలుగును, జ్ఞానాన్ని నింపిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విచ్చేసిన లక్షలాది భక్తుల – భక్తి అలలు ఎన్నో వేల నగరాల మీదుగా ప్రవహించి – గురు పూర్ణిమను ఆనందోత్సాహలతో నింపాయి.
గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినా రాష్ట్రంలోని బూన్ నగరంలో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో గురు పూర్ణిమ వేడుకలకు ప్రత్యక్షం గానూ, ప్రసార మాధ్యమాల ద్వారానూ కొన్ని లక్షలమంది భక్తులు,శిష్యులు 182 దేశాలనుండి పాల్గొన్నారు.
గురు పూర్ణిమ సందర్భంగా గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ భక్తులచేత ప్రత్యేక పున్నమి ధ్యానం చేయించారు. నిత్య నూతనమూ, సనాతనమైన గురు పరంపర గురించి గురుదేవులు వివరించారు. శ్వాస యోగ పీఠానికి చెందిన స్వామి వాచానంద కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
“మన చుట్టూ గాలి ఉంది కానీ దాని పైన దృష్టి ఉంచినప్పుడే ఆ గాలిని మనం గమనించగలుగుతాం “, అలాగే గురువుకు మనకు ఉన్న సంబంధాన్ని, కృతజ్ఞతను తెలియచేసే వేడుకే గురు పూర్ణిమ అని, ఆ కృతజ్ఞతా భావమే మనల్ని ముందుకి నడిపిస్తుందని శ్రీశ్రీ వివరించారు. గురువు మన బాధలన్నిటిని తీసివేస్తారని, గురువు సాన్నిధ్యంలో మన యొక్క ఉత్సాహం, ఆనందం మరింత మెరుగవుతాయని, జ్ఞాన సమృద్ధి జరుగుతుందని, మనలో దాగున్న కళలు మరింత మెరుగుపడి వికసిస్తాయని, గురువు సన్నిధిలో ఉన్నతి కలుగుతుందని శ్రీశ్రీ చెప్పారు.
భారతదేశంలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో గురుపూర్ణిమ వేడుకలు ప్రత్యేకమైన గురుపూజ, అద్భుతమైన సత్సంగాలతో అలరారాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమ సభ్యులంతా అమెరికాలోని బూన్ ఆశ్రమంలో జరిగిన గురుపూర్ణిమ వేడుకలను వెబ్ కాస్ట్ ద్వారా వీక్షించి ఆనంద డోలికల్లో తేలియాడారు. దేశవ్యాప్తంగా జరిగిన గురు పూర్ణిమ వేడుకలు ఈ కింది చిత్రం ద్వారా మీరు వీక్షించవచ్చు.
బెంగళూరులోని అంతర్జాతీయ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం లో వేడుకలు ధ్యానంతో మొదలయ్యాయి,అలాగే దక్షిణామూర్తి హోమము, అత్యున్నత జ్ఞానానికి ప్రతినిధి అయిన శ్రీ దక్షిణామూర్తిని మేలుకొలిపే యజ్ఞాలు భక్తులను ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ, ఆనందాతిరేకాలలో ఓలలాడించాయి. గురుదేవులు శ్రీశ్రీ రవిశంకర్ చెల్లెలు భానుమతి నరసింహన్ ఆధ్వర్యంలో 150 మంది గురు పండిట్లతో గురుపూజ అత్యద్భుతంగా జరిగింది.
న్యూఢిల్లీలోని “భారత మండపం”లో గురుపూర్ణిమ వేడుకలు అత్యద్భుతంగా సాగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ సాహిల్ జగిత్యాని ఆధ్వర్యంలో జరిగిన భజనలు, సత్సంగం భక్తులను సంతోషంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమంలో 5,000 మంది పైగా భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News