
-గతవారం వరకు రెవెన్యూ శాఖకు చెందిన 2824 ధరఖాస్తుల్లో నేటి వరకు 2700 పరిష్కారం…
-సబ్ కలెక్టర్ జి.ఎస్ఎన్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 64 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 10, పురపాలక 6, పౌర సరఫరాలు 10, పోలీస్ శాఖ 3, ఇతర అన్ని శాఖలకు సంబంధించి మరో 25 ఆర్జీలు కలిపి మొత్తం 54 ఆర్జీలు స్పందన ద్వారా దరఖాస్తులు అందాయన్నారు. అదేవిధంగా గత వారం వరకు స్పందన కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి 2824 ధరఖాస్తులు రాగా వాటిలో నేటి వరకు 2700 పరిష్కరించబడ్డాయని, మిగిలిన 124 ధరఖాస్తులు కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో సదరం క్యాంప్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. స్పందనలో ప్రజల నుంచి అందిన ఆర్జీలను తక్షణమే ఆదే రోజు అన్లైన్ చేసి సంబంధిత శాఖలకు పరిష్కరం నిమిత్తం పంపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ మంజూరు తదితర విషయాలపై ప్రజల నుంచి అందిన ఆర్జీల పరిష్కర నిమిత్తం సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సంబంధిత సమస్యల పరిష్కరానికి అవసరమైన ఆదేశాలను, సూచనలను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ ను వేధింపులకు గురి చేస్తే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన గూడపురెడ్డి లక్ష్మిదేవి (70) ఆర్జీ ఇస్తూ తన తల్లి నారాయణమ్మ కలసి జీవిస్తున్నమని, అయితే తనకు సంబంధించిన పొలం, మిగిలిన పొలం కలిపి తన కుమారునికి తన భర్త రాయడం జరిగిందన్నారు. దీంతో ఇద్దరు కుమార్తెలు కలిగిన తనకు జీవనం, జరుగుబాటు కాకపోవడంతో మనోవర్తి కేసు పెట్టాగా కోర్టు తీర్పు ప్రకారం నెలకు 5 వేలు చెల్లించాలని ఆదేశించిన తన భర్త భరణం కట్టకపోగా తన తల్లిఅయిన నారాయణమ్మ పేరుతో ఉన్న ఇంటిని కూడా నా కుమారుడుకే ఇవ్వమని చెబుతున్నారని దీంతో నా కొడుకు కోడలు నన్ను, నా తల్లిని అనేక రకాలుగా వేదిస్తున్నరన్నారు. ఈ విషయంపై సీనియర్ సిటిజన్ కోర్టులో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడంతో పాటు భరణం చెల్లింపు జరిగేలా చూస్తామన్నారు. జి. కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు ఆర్జీ ఇస్తూ తమ పంటపొలాల ఎగువభాగంలో చేపల చెరువు త్రవ్వియున్నారని సదరు చెరువు నుండి వచ్చే కాలుష్య నీరు, వ్యర్థపదార్థాలు మా పంట పొలాలకు చేరి పంటవేసేందుకు పనికి రాకుండా జరుగుతుందన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంపై భూ సార పరీక్షలు నిర్వహించడంతోపాటు మత, తదితర శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మధురనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే రిటైర్డు అధికారి బి వసంతకుమార్ ఆర్జీని అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను సబ్ కలెక్టర్ సందర్శించి ఫీవర్ సర్వే నిర్వహణ తీరు, 104,108 సేవల తీరును పరిశీలించారు. కార్యక్రమంలో కార్యాలయ ఏట ఎస్. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ డిఇవో ఎల్. చంద్రకళ, డిఎల్ పివో కె. చంద్రశేఖర్, సిడిపివో ఎస్. సువర్ణ, ఆర్టీసీ డిపో మేనేజర్ కె. బసవయ్య, వ్యవసాయ శాఖ ఏడి. యం, సునీల్, హౌసింగ్ అధికారి బిఎస్ రవికుమార్, తదితర 25 శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News