Breaking News

గృహ నిర్మాణం పనుల్లో పురోగతి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి  కలెక్టర్ ప్రశాంతి సూచన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అందరికీ గృహం” కార్యక్రమం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాల లక్ష్యంలో దిగువ స్ధానంలో ఉన్న ఐదు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఏ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం అందించిన అదనపు ఆర్థిక సహాయాన్ని గృహ నిర్మాణాల్లో సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, పనుల పురోగతిలో స్పష్టమైన మార్పు కనిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని సీతానగరం, నల్లజర్ల, దేవరపల్లి, రాజానగరం, కడియం మండలాల పరిధిలో అదనపు ఆర్థిక సహాయం పొందిన 704 మంది లబ్ధిదారుల్లో కేవలం 150 ఇళ్లు మాత్రమే రూఫ్ లెవెల్ దశను చేరుకున్నాయని తెలియజేస్తూ, ఈ పనితీరు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆమె స్పష్టం చేశారు. దిగువ స్థాయి లో ఉన్న మండలాల పనితీరు జిల్లా పురోగతిపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు.స్వంత ఇంటి కలను సాకారం చేయడం ద్వారా ప్రజలకు భద్రతా భావన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసిందని, ఆయా మండలాలలో లబ్ధిదారు లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధి విధానాలను వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అందుకున్న నిధులను సమర్ధవంతంగా వినియోగించడంతోపాటు, నిర్మాణ పనుల పురోగతిని వేగవంతం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని చెప్పారు. గృహ నిర్మాణ దశల వారీ పురోగతికి అనుగుణంగా స్టేజ్ కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలని, ఆయా దశల ప్రకారం బిల్లులు సకాలంలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అలాగే ఇసుక, సిమెంట్ వంటి ముడి సరుకులు మరియు మౌలిక సదుపాయాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు హౌసింగ్ ఇంచార్జ్ పిడి ఎస్. భాస్కర్ రెడ్డి, సంబంధిత మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *