Breaking News

తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన కలెక్టర్ పి. ప్రశాంతి

-ఫస్ట్ రిఫరల్ యూనిట్ అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకు రావాలని అధికారులకు సూచన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి బుధవారం తుమ్మలోవ ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను ఆమె సమీక్షించి, పలు వార్డులు, పరికరాలు, రికార్డులు, మందుల నిల్వలు, టెస్టుల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై చర్చించడం, రికార్డులు నిర్వహణ తీరు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆసక్తిగా ఆరా తీసి, ఎటువంటి రాజీ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగ్గా ఉండాలని, రోజువారీ పరిశీలనతో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్శనలో ఆమె వెంట ఏఎన్ఎం రత్నం, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ రిఫరల్ యూనిట్ (FRU) అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చిస్తూ, వైద్య ఆరోగ్య అధికారులకి, మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారి కి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అయితే, కోవిడ్ అనంతరం ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించక పోతున్నదిగా, రోగుల రాక కూడా తక్కువగానే ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను ఇతర అవసరమున్న ప్రాంతాల్లో వినియోగించేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. వైద్య సదుపాయాలు ప్రజలకు సులభంగా అందేలా చేసే విధంగా సేవల మళ్లింపు (rationalisation) అవసరమైతే పరిశీలించాలన్నారు. ఈ మేరకు డి.ఎం.హెచ్.వో డా. కె. వెంకటేశ్వరరావు, ఎం.హెచ్.ఓ డా. వి. వినూత్న, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వైద్యాధికారి డా. శ్రీవల్లి, డిప్యూటీ డిఎం హెచ్ ఓ డా. సరితలతో సమావేశం నిర్వహించి, యూనిట్ అభివృద్ధి, సిబ్బంది వినియోగం, రోగుల అవసరాలపై సమీక్ష జరిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *