Breaking News

ఘనంగా వాసవ్య లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి (VMM) భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది.బెంజ్ సర్కిల్ నందు మేయిన్ క్యాంపస్ లో VMM ఉపాధ్యక్షురాలు డాక్టర్ దీక్ష జాతీయ జెండాను ఎగురవేశారు. సమానత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. మరియు స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశం సంపాదించిన స్వేచ్ఛ అని ఇది మన దేశ పురోగతికి పునాది అని ఆమె అన్నారు. VMM అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి మట్లాడుతు మహిళలు తమను రక్షించే చట్టపరమైన హక్కులు మరియు చట్టాల గురించి తెలుసుకోవాలని, గౌరవంగా జీవించాలని మరియు అవసరమైన వారికి సహాయం అందించాలని కోరారు. కార్యక్రమానికి HCL టెక్నాలజీస్ నుండి రవితేజ, వాసవ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కానూరులో ఉన్న “వాసవ్య బాలల గృహం”లో జీ.రష్మీ,కార్యదర్శి వాసవ్య మహిళా మండలి జాతీయ జెండాను ఎగురవేశారు. అనాతరం దేశం కోసం ప్రాణాలను అంకితం చేసిన మహనీయుల గురించి పిల్లలకు వివరించారు. ప్రతి ఒక్కరు దేశభక్తి, సేవా గుణం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. గోశాలలో వాసవ్య నిర్వహిస్తున్న భాండం వృద్ధాశ్రమంలో జాతీయ జెండాను ఎగురవేసారు,కార్యక్రమానికీ ముఖ్య అతిదిగా గోసాల పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు, మామ్మలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *