-వాల్మీకి బోయ కమ్యూనిటీకి గుర్తింపు ప్రతిపాదనకు ఓ.ఆర్.జి.ఐ మద్దతు ఇవ్వలేదు
-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి దుర్గాదాస్ ఉయికె వెల్లడి
-పి.ఎమ్-జి.యు.జి.ఎ పథకం పురోగతి పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ జి.లక్ష్మీనారాయణ
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన్ మంత్రి జనజాతీయ గ్రామ అభియాన్ (PM-JUGA) కింద గ్రామాల సంఖ్యను పెంచే ప్రణాళికలు ప్రస్తుతం లేవు. వాల్మీకి బోయ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. 2017లో TCR&TI చేసిన అధ్యయనం ప్రకారం ఈ కమ్యూనిటీకి చెందినవారి అంచనా సంఖ్య 25,80,000 గా వుంది. వీరందరికి గుర్తింపు లభిస్తే ఈ కమ్యూనిటీ ప్రధాన్ మంత్రి జనజాతీయ గ్రామ అభియాన్ (PM-JUGA) కింద లబ్ధి పొందుతుంది. అయితే భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం (ORGI) ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి దుర్గాదాస్ ఉయికె వెల్లడించారు.
పార్ల మెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో గురువారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ జి.లక్ష్మీనారాయణ కలిసి పి.ఎమ్-జి.యు.జి.ఎ పథకం పురోగతి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. వీరికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి దుర్గాదాస్ ఉయికె లిఖిత పూర్వకంగా బదులు ఇవ్వటం జరిగింది.
గ్రామాల సంఖ్య పెంచే ప్రణాళికలు లేవని గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. “ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్” కింద ఇప్పటికే 63,643 గ్రామాలు ఎంపికైయ్యాయని, ఎంపికయ్యాయని , ఈ పథకం 2024-25 నుండి 2028-29 వరకు ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి దుర్గాదాస్ ఉయికె పేర్కొన్నారు.. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 549 జిల్లాలు, 2,911 బ్లాక్స్ కింద ఈ కార్యక్రమం అమలు చేయబడుతోందని తెలిపారు.
ప్రధాన్ మంత్రి జనజాతీయ గ్రామ అభియాన్ (PM-JUGA) సమర్థవంతంగా అమలు జరగడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోందని, ఈ సమావేశాల్లో గ్యాప్ఫిల్లింగ్ చర్యలు, పురోగతి పర్యవేక్షణ జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి దుర్గాదాస్ ఉయికె వివరించారు.
Prajavartha Online Telugu News