తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ నియంత్రణపై జిల్లా లోని వైద్య అధికారులకు NCD 4.0 క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ కార్యకమము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో తిరుపతి, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) లో మరియు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు ఈరోజు రీ-ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి SVMC ప్రిన్సిపాల్ డా. జి. రవి ప్రభు, DMHO డా. బాలకృష్ణ నాయిక్, SVRRGGH సూపరింటెండెంట్ డా. రాధా, GMH సూపరింటెండెంట్ డా. జి. ప్రమీలాదేవి మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. సునిత శ్రీగిరి పాల్గొన్నారు.
“కార్యక్రమంలో భాగంగా ఎస్.వి.ఎం.సీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవి ప్రభు మాట్లాడుతూ”క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడం వలన జీవనకాలం పెరిగి జీవన నాణ్యత మెరుగవుతుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక ఐచ్చికం కాదు, ఇది ప్రతి వ్యక్తి బాధ్యత. శిక్షణలో భాగంగా CHC నుండి నిపుణులైన స్పెషలిస్టు వైద్యులు Gynaecologist s , Dental surgeons పాల్గొని, డెడికేటెడ్ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ సభ్యుల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా క్యాన్సర్ స్క్రీనింగ్, NCD 4.0 ప్రోటోకాల్ అమలు, వైద్య అధికారుల భూమిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ శిక్షణ ద్వారా వైద్య అధికారులలో ప్రజారోగ్య అవగాహన పెంపు మరియు సమర్థవంతమైన సేవలందించడంలో మరింత బలోపేతం అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ఆధ్వర్యంలో, నోడల్ అధికారులు డా. టి. శివకళ గారు , Dr.Guru vijay మరియు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. పి. రెడ్డి ప్రసాద్, dr. జితేంద్ర లు సమన్వయంతో, ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ సభ్యుల సహకారంతో నిర్వహించారు.
Prajavartha Online Telugu News