-హాస్టల్లో మౌలిక వసతుల కల్పనపై విప్లవాత్మక మార్పులు తెచ్చాం : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సాంఘీక సంక్షేమ హాస్టల్లల్లో మౌలిక వసతుల కల్పనపై విప్లవాత్మక మార్పులు తెచ్చామని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజినల్ కాన్ఫరెన్స్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సమక్షంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తో MOU ను జిల్లా కలెక్టర్ కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్కూల్ పిల్లలకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యొక్క ప్రోగ్రామ్స్అందజేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో 11 వేల మంది పిల్లలకు మరియు 250 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఈ శిక్షణలో విద్యారులు ఒత్తిడి నుంచి తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యాలను గూర్చి తెలుపుతారని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున అందించే శిక్షణ లో పిల్లలకి అవసరమగు స్కిల్స్, మరియు కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్, మానసికంగా , శారీరకంగా, ఎమోషనల్ గా బలోపేతం అవ్వడానికి అవసరమగు అన్ని అంశాలు ఉంటాయని, పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా ముందు కు సాగేలా శిక్షణ అందివ్వబడుతుందని తెలిపారు.
తిరుపతి జిల్లాలోని హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ సంక్షేమ సంస్థల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టిందన్నారు. గత ఎనిమిది నెలల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF), CSR నిధులు మరియు శాఖా పర నిధులను సమన్వయం చేసుకుని రూ.22 కోట్ల విలువ గల పనులు ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో హాస్టళ్లలో తాగునీటి వనరులు, సెప్టిక్ ట్యాంకుల మరమ్మత్తులు, మెస్ ఫెసిలిటీ, విద్యుత్ సౌకర్యాలు, ఫ్యాన్స్, లైటింగ్, రూఫ్ లీకేజ్ నివారణ, టాయిలెట్స్ ఫంక్షనల్ చేయడం, బయటి డ్రైనేజ్ కనెక్టివిటీ, డీప్ క్లీనింగ్, కిచెన్ హైజీన్ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించామన్నారు. అదనంగా ప్రతి నియోజకవర్గంలో మోడల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వీటిలో లైబ్రరీ, STEM ల్యాబొరేటరీస్, సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, కిచెన్ గార్డెన్స్, మెడిసినల్ ప్లాంట్స్ వంటి ఆధునిక సదుపాయాలు అందించబడతాయన్నారు. విద్యార్థుల శారీరక-మానసిక శ్రేయస్సు దృష్ట్యా యోగ ప్రోగ్రామ్‌లు కూడా ప్రారంభించబడ్డాయన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో MoU కుదుర్చి సుమారు 11,000 మంది విద్యార్థులకు లాభం చేకూరనుందన్నారు. ఈ చర్యలతో తిరుపతి జిల్లాలోని విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వసతి సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులను కుమార్ నాయర్, రోహన్ , ప్రవీణ్ కుమార్ లకు శాలువలు కప్పి వెంకటేశ్వర స్వామి చిత్ర పటాలను జిల్లా కలెక్టర్ అందించారు. అలగే రాష్ట్ర మంత్రి వర్యులకు సాంఘీక సంక్షేమ శాఖా ప్రిన్సిపాల్ సెక్రటరీ కి, డైరెక్టర్ లకు శాలువాలు కప్పి వెంకటేశ్వర స్వామి ప్రతిమలను జిల్లా కలెక్టర్ అందించారు. అనంతరం మంత్రి వర్యులు జిల్లా కలెక్టర్ కు శాలువా తో సత్కరించి వెంకటేశ్వర స్వామీ ప్రతిమను అందించారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్, డైరక్టర్ లావణ్య వేణి, అనంతపురం,చిత్తూరు, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైయస్సార్ కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సాంఘిక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారులు,ఏఎస్ డబ్ల్యూఓ లు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News