Breaking News

మరుపురాని మహానేతకు ఘన నివాళి…

-సర్పంచ్ గా కూడా గెల‌వ‌లేని వ్య‌క్తి నారా లోకేష్
-దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సర్పంచ్ గా కూడా గెల‌వ‌లేని వ్య‌క్తి నారా లోకేష్, సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి  గురించి అవాకులు, చ‌వాకులు మాట్లాడ‌టం విడ్డురుంగా ఉంది అని, దొడ్డి దారిలో రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేసి గెలిచి చూపించాల‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు స‌వాల్ చేశారు. గురువారం మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా పోలీస్ కంట్రోల్ రూం వ‌ద్ద నున్న వైఎస్ విగ్ర‌హానికి ఎమ్మెల్సీ క‌రీమున్నీసా, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ, చైర్మ‌న్లు గౌత‌మ్ రెడ్డి, అడ‌పా శేషు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్లు బెలం దుర్గు, ఆవుత శ్రీ‌శైల‌జా రెడ్డి, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జి దేవినేని అవినాష్, వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షలు బొప్ప‌న భ‌వ‌కుమార్‌, వివిధ విభాగాల నాయ‌క‌లు వైసీపీ శ్రేణుల‌తో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు నివాళులర్పించారు

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏది కావాలో ఆది పూర్తిగా అందించిన మ‌హానేత‌, ఊమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా అంద‌రికీ మేలు జ‌రిగే విధంగా వారు తీసుకున్న నిర్ణ‌యాలకు ఇప్ప‌టికి ప్ర‌జ‌లు జై జైలు ప‌లుకుతున్నారన్నారు.. అందరికీ అవసరమైన విద్య, వైద్యాలను అందు బాటులోకి తీసుకొచ్చారు. పేదరికం వల్ల ఏ ఒక్క రూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూపకల్పన చేశారు. లక్షలాదిమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓసీ విద్యార్థులు ఉన్నత విద్యావంతులయ్యేలా చేశారన్నారు. వైద్యానికి డబ్బులేక ఏ ఒక్కరూ ఇబ్బం ది పడకూడదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్, గర్భకోశవ్యాధులు, గుండె జబ్బులు తదితర అనేక వ్యాధులకు చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని రూపొందించి ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు ఉచితంగా దక్కేలా చేశారు. ఉన్నత చదువులు అందరికీ అందుబాటు లోకి రావాలని జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.

తనయుడు. ..మరో రెండడుగులు ముందుకు… : మేయ‌ర్
ప్రజల సంక్షేమం కోసం మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనం అభ్యున్నతి కోసం రెండడుగులు ముందుకేస్తున్నారు మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌–19ను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో చేర్చారన్నారు.
న‌గ‌రంలో జ‌రిగిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌రీమున్నీసా, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ, చైర్మ‌న్లు గౌత‌మ్ రెడ్డి, అడ‌పా శేషు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్లు బెలం దుర్గు, ఆవుత శ్రీ‌శైల‌జా రెడ్డి, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జి దేవినేని అవినాష్, వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షలు బొప్ప‌న భ‌వ‌కుమార్‌, వివిధ విభాగాల నాయ‌క‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *