-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేజర్ ఔట్ ఫాల్ డ్రైనలలో డీసిల్టింగ్ పూర్తి చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. శనివారం ఉదయం తన పర్యాటన లో భాగంగా వన్ టౌన్, నైజాం గేట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, కబేళ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాలని పర్యటించి మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్లలో ఎటువంటి వ్యర్ధాలు ఉన్న వెంటనే తీసివేయాలని, కృష్ణవేణి మార్కెట్ వద్ద ఉన్న ఔట్ ఫాల్ డ్రైన్ల లో వెంటనే ఎస్కలేటర్ ను అమర్చి అక్కడున్న వ్యర్ధాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఔట్ ఫాల్ డ్రైన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేటును ఏర్పాటు చేసి నాలా మాన్ తో ఎప్పటికప్పుడు పూడికలు తీసేటప్పుడు గేట్ ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కబేళ పరిశీలించి, జంతు వ్యర్థాలను సక్రమంగా నిర్వహణ చేయాలని, జంతు వ్యర్ధాలతో సంపద సృష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ అన్న క్యాంటీన్ పరిశీలించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారికి అనుగుణంగా అన్న క్యాంటీన్లో మెరుగైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు
Prajavartha Online Telugu News