Breaking News

జిల్లాలో సెప్టెంబరు 15 నుంచి 30 వరకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల బృందం పర్యటన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో మరో 15 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (ఎన్‌క్యూఏఎస్) దృవీకరణ పొందేందుకు సెప్టెంబరు 15వ తేదీలోగా సిద్ధంగా వుంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్, శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జెసి క్యాంప్ కార్యాలయంలో శనివారం జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల జిల్లా స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 8 ఆసుపత్రులకు ఎన్‌క్యూఏఎస్ గుర్తింపు లభించగా తాళ్లపాలెం, చినఓగిరాల పిహెచ్ సిలకు, జిజిహెచ్ లేబర్ రూమ్ కు, మచిలీపట్నంలో జిల్లా ఆసుపత్రిలోని లేబర్ రూమ్ కు దృవీకరణ పత్రాలు అందయాన్నారు. జిల్లాలో మరో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల దృవీకరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలను పంపగా ఈ మేరకు ఎనక్యూఏఎస్ రెండు బృందాలు సెప్టెంబరు 15 నుంచి 30వ తేది వరకు జిల్లాలో పర్యటించనున్నయన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో చందర్ల, 17, 18లో చందర్లపాడు, 19,20లో లింగాలపాడు, 20,21లో చా ట్రాయి, వేకనూరు, 22,23లో పురిటిగడ్డ, ఎదురుమొండి, శ్రీకాకుళం, 24,25లో సొర్లగొంది, కంచికచర్ల, 27,28లో కొండపల్లి, 29,30వ తేదీల్లో గురజ, ఈదర ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఈ బృందాలు పరిశీలిస్తాయన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడు-నేడు కింద చేపట్టిన పనులను నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సెప్టెంబరు 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఆVండ్ బి ఎని జెసి ఆదేశించారు. జిల్లా అస్యూరెన్స్ కమిటీ ఈ పనుల పూర్తి చేయడంపై, కేంద్రం బృందం పర్యటన కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ఘాండ్ బి ఎస్ఎ శ్రీనివాసమూర్తి, డియంహెవో యం. సుహాసిని, జిల్లా అస్యూరెన్స్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్ డా. చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *