-కారుణ్య నియమాకల కింద 55 మందికి ఉద్యోగ నియామకాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కారుణ్య, ఎస్ సి ఎస్ కేసుల్లో బాధితులకు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. శనివారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కలెక్టర్ జె. నివాస్, జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత కారుణ్య నియామకాల్లో ఎంపికైన 55 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. వీరిలో 35 జూనియర్ అసిస్టెంట్లు, 12 ఆఫీస్ సబార్డినేట్లు , ఇరువురు స్వీపర్లు ఉన్నారు. అలాగే అత్యాచారానికి గురైయిన 6 మంది భాధితులకు కూడా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద ఉద్యోగ అవకాశం కల్పించారు. అందులో 5 గురిని ఆఫీస్ సబార్డినేట్లుగా, మరొకరిని స్వీపర్‌గా నియమించారు. జిల్లా యంత్రాంగం 5 6 పోస్టులను భర్తీ చేయడం పట్ల ఉద్యోగాలు పొందిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంతో పారదర్శకంగా అతి తక్కువ సమయంలో తమకు ఉద్యోగాలు కల్పించినందుకు వారు జిల్లా కలెక్టర్ జె. నివాసకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె. నివాస్ కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారందరితో మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీ, అకింతభావంతో పనిచేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగం పొందడం ఎంతో కష్టమని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఇందులో భాగంగా వారి వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని హితవు పలికారు. ఉద్యోగాలు పొందిన 56 మందిల్లో 21 మంది వాణిజ్య పన్నుల శాఖలోను, మరో 8 మంది రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందారు. అలాగే జిల్లా విద్యాశాఖ, రవాణశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఇద్దరేసి చొప్పున జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. అలాగే వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఒక్కొక్కరు చొప్పున జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. అలాగే రెవెన్యూ శాఖలో 5 గురును ఆఫీసు సబార్డినేట్లుగా నియమించారు. జిల్లా కోపరేటివ్ కార్యాలయంలో ఇద్దరిని, ఆఫ్రండ్ బి, జిల్లా రిజిస్ట్రార్, ప్రభుత్వ ఐటిఐ,
జిల్లా ఆడిట్ ఆఫీస్, సిద్ధార్థ మెడికల్ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున ఆఫీసు సబార్డినేట్లుగా నియమించారు. ఎస్ సి ఎస్ కేసుల్లో బాధితులకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఒక్కొక్కరిని జూనియర్ అసిస్టెంట్లుగా మిగిలిన కార్యాలయాల్లో 5గురిని ఆఫీసు సబార్డినేట్లుగా, మరొకరిని స్వీపర్‌గా నియమించారు.