-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌పై సనాతనవాది దాడికి పాల్పడడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నడూ లేని విధంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో నేడు అనూహ్య ఘటన చోటుచేసుకోవడం విచారకరం. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తిjైున జస్టిస్ బిఆర్ గవాయ్‌పై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది చెప్పుతో దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ దేవుళ్లపై సీజేఐ చేసిన వ్యాఖ్యలను సహించలేని సనాతనవాది ‘సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు’ అని కేకలు వేయడం దుర్మార్గం. లౌకిక వ్యవస్థగా పేరుగాంచిన భారత దేశంలో గతంలో ఎవరి అభిప్రాయాలను వారు స్వేచ్ఛగా వెలిబుచ్చే పరిస్థితి ఉండేది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సనాతనవాదం తారాస్థాయికి చేరింది. సనాతనవాదుల్లో రోజురోజుకీ అసహనం పెరిగిపోతోంది. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడులు చేసే స్థాయికి సనాతనవాద పిచ్చి పరాకాష్టకు చేరడం గర్హనీయం. సిజెఐ గవాయ్‌పై దాడికి పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. హేతువాదులు, ప్రజాతంత్రవాదులంతా సనాతనవాదుల దురాగతాలను తీవ్రంగా ఖండిరచాలని కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News