Breaking News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్

*విశాఖ‌ప‌ట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27, 28 ,29 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు, పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ప్రయాణాలు రద్దు చేసు కోవాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద హోర్డింగ్ ల సమీపంలో ప్రజలు నిలబడరాదని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులు సముద్రం లోకి వేటకు వెళ్ల వద్దని ,వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కోరారు.రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పల్లపు ప్రాంతాల్లో, కొండ వాలు ప్రాంతాలలో,నది ఒడ్డున నివసించేవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.సముద్రం లో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్ లలో స్నానాలకు దిగవద్దని కోరారు.

పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మం తాత్కాలికంగా ర‌ద్దు…..

మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27వ తేదీ (సోమ‌వారం) క‌లెక్ట‌రేట్లో జ‌ర‌గాల్సిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ (పీజీఆర్ఎస్) కార్య‌క్ర‌మాన్ని తాత్కాలికంగా ర‌ద్దు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ తెలిపారు.

విద్యా సంస్థలకు శెలవు……

*మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు 27 మరియు 28 తేదీలలో సెలవులు జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ సెలవులు ప్రకటించారు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు……

తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లాలో వర్షాలు, గాలులు ఇతర ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0891- 2590102 నకు గాని, 0891- 2590100 నకు గాని ఫోన్ చేసి తెలియ జేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *