-ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లను ఆదేశించారు. మొంథా తుఫాన్ పరిస్థితిపై జిల్లాలో పరిస్థితిని, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఆదివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లను మంత్రి పార్థసారధి టెలిఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మొంథా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున, రాబోయే 3 రోజులపాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలలోని వయో వృద్దులు, గర్భిణీలు, విభిన్న ప్రతిభావంతులు, చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలకు హోర్డింగ్లు, స్థంబాలు వంటివి నెలకొరిగే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
త్రాగునీరు, పారిశుధ్యం,విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో సహాయ చర్యలు కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల అధికారులు సమన్వాయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ,రెవెన్యూ, పోలీసు, విద్యుత్, మెడికల్,అగ్రికల్చర్, ఇరిగేషన్,పంచాయతీరాజ్, ఆర్&బి, అధికారులందరూ అప్రమత్తతో ఉండి సమన్వయంతో పని చేసి నివారణ చర్యలు నిర్వహించాలన్నారు.భారీ వర్షాల కారణంగా వాగులు, కల్వర్టులు, కాజ్ వే ల వద్ద వరద నీటి ఉధృతి కారణంగా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, మండల స్థాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి, పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, , త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు నియోజకవర్గంలో ఉద్యాన వనాలు, ఆపరాలు,కూరగాయలు, వరి.తదితర పంట నష్టము కలుగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఎంత మేర నష్టం వాటిల్లిందో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలన్నారు. వర్షాల కారణంగా చెట్లు కూలి రవాణా సౌకర్యాలకు అంతరాయం కలగకుండా తక్షణమే చెట్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ సమయంలో ప్రజలను సాధ్యమైనంత మేర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, బయట ప్రదేశాలలు, చెట్లు కింద నిలబడ వద్దని, నదులు, చెరువులవద్ద ఉండవద్దని మంత్రి ప్రజలకు విజ్ణప్తి చేశారు. అనుక్షణం ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పార్థసారధి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా తుఫాన్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లు మంత్రి పార్థసారథికి వివరించారు.
Prajavartha Online Telugu News