విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ గాదె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ పదవి కాలం అక్టోబర్ 31 వ తేదీ తో ముగియటంతో కళాశాల మేనేజ్మెంట్ నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ను నియమించి నట్లు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీన క్వాడ్రస్ తెలిపారు. ఈరోజు ఉదయం కళాశాల లో పూర్వ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసిన డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ కళాశాల నిర్వహణా బాధ్యతలను అధికారికంగా డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ కు అప్పగించారు. డాక్టర్ సిస్టర్ఇన్యాసమ్మ మాట్లాడుతూ కళాశాల నిర్వాహణ సమర్ధవంతంగా నిర్వహిస్తాను అని విమెన్ ఎడ్యుకేషన్ మరియు సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల మేనేజ్మెంట్ సిస్టర్స్,డిగ్రీ ,ఇంటర్ వైస్ ప్రిన్సిపల్స్, ఉష కుమారి,స్వప్న వున్నాం, డీన్స్ డాక్టర్ సిస్టర్ లావణ్య,పద్మలత,,అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News