Breaking News

“ది త్వా” తుఫాను కారణంగా పిజిఆర్ఎస్ రద్దు

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ది త్వా” తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 01.12.2025 తేదీ న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పిజిఆర్ఎస్) రద్దు పరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు “ది త్వా” తుఫాను కారణంగా సహాయకచర్యలలో ఉన్నందువలన ప్రజలెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను సోమవారం నాటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రద్దు చేశామన్నారు. ఈ అంశాన్ని ప్రజలందరూ గమనించి జిల్లా, రెవెన్యు, మండల కేంద్రాలకు వెళ్లరాదని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *